అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

మంచిర్యాల, మెట్రో సిటి టైమ్స్ (ఏప్రిల్ 2): రామగుండం పోలీస్ కమిషనరేట్ అర్ముడ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ టి. మధు పీసీ. 352 అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య లత, కుమారుడు సాయి చరణ్ లకి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000 (ఎనిమిది లక్షల రూపాయల) చెక్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) తన కార్యాలయం లో అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మధు కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్ ,ఆర్ఐ అడ్మిన్ దామోదర్, ఆర్ఐ హోం గార్డ్స్ మల్లేశం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సూపరింటెండెంట్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button