దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు వివిధ రూపాలలో ఆవిర్భవించారు
-ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్
కుత్బుల్లాపూర్, మెట్రో సిటీ టైమ్స్ (ఏప్రిల్ 1): దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు వివిధ రూపాలలో ఆవిర్భవించారని అందులో ఒకటే భద్రకాళి అవతారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అన్నారు. చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లో సోమవారం నిర్వహించిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి, కాలభైరవ సహిత నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మూల బసవరాజ్, కళ్యాణ్ రావ్, రాజప్ప, రాజయ్య స్వామి, రామయ్య స్వామి, ప్రకాష్, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్, సుభాష్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.