కాంగ్రెస్ పార్టీలో చేరిన 2వ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్
నిజాంపేట్, మెట్రో సిటీ టైమ్స్ (ఏప్రిల్ 5): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ 2వ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలాన్ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ గోపాల్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చిట్ల దివాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై అదేవిధంగా రెండవ డివిజన్ ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక డివిజన్ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ 2వ డివిజన్ అధ్యక్షుడు భాస్కరాచారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధర్మేంద్ర, మహిళా అధ్యక్షురాలు పద్మా గౌడ్,డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శరత్ రెడ్డి, సికిందర్ రెడ్డి, సందీప్ గౌడ్, శ్రీ సాయి గౌడ్, నాగరాజ్ గౌడ్, మధుకర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఆంజనేయ వర్మ, రాజిరెడ్డి, శివరాం, ధనుంజయ్, తదితరులు ఉన్నారు.